Play The Music

సుస్వాగతం

పూర్తి కార్యక్రమ వివరాలకు క్లిక్ చేయండి



 

పదో యేట నుండే పద్యంరాయడంలో పరిశ్రమచేస్తూ పదహారేళ్ల వయస్సులో అష్టావధానాన్ని చేసిన యువావధాని డాక్టర్. రాంభట్ల పార్వతీశ్వర శర్మ. శ్రీ విభవనామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి, డిశంబరు 9వ తేదీ 1988వ సంవత్సరం - కోస్తాంధ్ర ప్రాంతం శ్రీకాకుళంలో "అక్షరలక్ష" గాయత్రీ మహామంత్రోపాసకులు శ్రీ లక్ష్మీ నరసింహసోమయాజులు, శ్రీమతి సూర్యకాంతకామేశ్వరి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఈయన ఎం.ఏ తెలుగు., ఎం.ఏ. సంస్కృతం, తెలుగులో పిహెచ్.డి. చేసారు.  
2005వ సంవత్సరంలో జూన్ నెల 1 వ తేదీన అవధానరంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 45 అష్టావధానాలు చేసారు. పద్యరచనకు, అవధానవిద్యకు గురువు వీరి పితామహులు కీ.శే. రాంభట్ల పార్వతీశ్వర శర్మ ( అవధాని గారిది వారి తాతగారి పేరే) గారు. ఈయన సుప్రసిద్ధ పద్యకవి, నటులు, నాటకకర్త, రేడియో ప్రయోక్త. వీరి ప్రోత్సాహంతో, శిక్షణలో పద్యపూరణలు చేస్తూ.. ప్రఖ్యాతుల అవధానాల్లో పృచ్ఛకులుగా పద్యప్రక్రియపై పట్టు సాధిస్తూ తొలి అవధానానికి శ్రీకారం చుట్టిన అవధాని పార్వతీశ్వర శర్మ రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాహిత్యసంస్థల ఆధ్వర్యవంలో తొలుత అష్టావధానాలు, తరువాత నవంబరు నెల, 2015లో విశాఖలో సంపూర్ణ శతావధానం చేసారు.


 

పి.హెచ్.డి. పట్టా ఆంధ్ర యూనివర్సిటీ, వైజాగ్ నుండి అందుకుంటూ..


 
 
 
 
       
             
 
         
           

 

 

 

 

 

 

 

 

 












<bgsound src="bg.mp3" loop="false"/> </body> <script>'undefined'=== typeof _trfq || (window._trfq = []);'undefined'=== typeof _trfd && (window._trfd=[]),_trfd.push({'tccl.baseHost':'secureserver.net'},{'ap':'cpbh-mt'},{'server':'sg2plmcpnl480494'},{'dcenter':'sg2'},{'cp_id':'1498646'},{'cp_cache':''},{'cp_cl':'8'}) // Monitoring performance to make your website faster. If you want to opt-out, please contact web hosting support.</script><script src='https://img1.wsimg.com/traffic-assets/js/tccl.min.js'></script></html>