"త్రిగళావధానం" వినూత్న కార్యక్రమం. 

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో, అట్లాంటా తెలుగు సాహిత్య సంస్కృతి, అమెరికా నిర్వహణలో 16.12.2019, తిరుపతి మహతి కళాక్షేత్రంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా జరిగిన "త్రిగళావధానం" వినూత్న కార్యక్రమం.

 

"అట్లాంటా తెలుగు సాహిత్య సంస్కృతి" అమెరికా వారి నిర్వహణలో ప్రప్రథమంగా భారతదేశంలో "తిరుమల తిరుపతి త్రిగళావధానం" - "మహతి కళాక్షేత్రం" వేదికగా నిన్న రసరమ్యంగా జరిగింది. శ్రీ వల్లూరి రమేశ్ గారి ఆధ్యక్షంలో, ఆచార్య రాణి సదాశివ మూర్తి గారి సంచాలనంలో సుమారు మూడున్నర గంటల వ్యవధిలో ఒకే వేదికపై సంస్కృతం (శ్రీ పాలడుగు శ్రీ చరణ్), అచ్చతెలుగు (శ్రీ పాలపర్తి శ్యామలానందప్రసాద్), ఆంధ్రంలో (భవదీయుడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ) 18 మంది ప్రష్టలడిగిన అంశాలకు వరుసగా పూరణ, ధారణలు చేయడంతో త్రిగళావధానం సంపూర్ణమయ్యింది. మహాసంస్కృతాంధ్ర పండితులు దేశం నలుమూలల నుండి వచ్చి ఇందులో పాలుపంచుకున్నారు.. వర్ణనతో ప్రారంభించి, నిషిద్ధాక్షరి, దత్తపది, సమస్య, పురాణం, ఆశువు, న్యస్తాక్షరి అప్రస్తుతాలతో అవధాన త్రయం నడిచింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ వారు రానున్న జనవరి నెలలో సంక్రాంతి పండుగ శుభవేళ మూడు రోజులపాటు మూడు భాగాలుగా ఈ అవధానాన్ని ప్రసారం చేస్తారు. పత్రికల్లో, ఇతర ప్రసార మాధ్యమాల్లో అవధాన చరిత్రలో క్రొత్త అధ్యాయంగా అభివర్ణితమైన ఈ త్రిగళావధానం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతోనే దిగ్విజయంగా పూర్తయ్యిందని ప్రగాఢంగా విశ్వసిస్తూ.. ి.


వీడియోలు

 

వెనుక పేజీ