రాంభట్ల పరిచయం

పదో యేట నుండే పద్యంరాయడంలో పరిశ్రమచేస్తూ పదహారేళ్ల వయస్సులో అష్టావధానాన్ని చేసిన యువావధాని డాక్టర్. రాంభట్ల పార్వతీశ్వర శర్మ. శ్రీ విభవనామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి, డిశంబరు 9వ తేదీ 1988వ సంవత్సరం - కోస్తాంధ్ర ప్రాంతం శ్రీకాకుళంలో "అక్షరలక్ష" గాయత్రీ మహామంత్రోపాసకులు శ్రీ లక్ష్మీ నరసింహసోమయాజులు, శ్రీమతి సూర్యకాంతకామేశ్వరి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఈయన ఎం.ఏ తెలుగు., ఎం.ఏ. సంస్కృతం, తెలుగులో పిహెచ్.డి. చేసారు.  


2005వ సంవత్సరంలో జూన్ నెల 1 వ తేదీన అవధానరంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 55 అష్టావధానాలు చేసారు. పద్యరచనకు, అవధానవిద్యకు గురువు వీరి పితామహులు కీ.శే. రాంభట్ల పార్వతీశ్వర శర్మ ( అవధాని గారిది వారి తాతగారి పేరే) గారు. ఈయన సుప్రసిద్ధ పద్యకవి, నటులు, నాటకకర్త, రేడియో ప్రయోక్త. వీరి ప్రోత్సాహంతో, శిక్షణలో పద్యపూరణలు చేస్తూ.. ప్రఖ్యాతుల అవధానాల్లో పృచ్ఛకులుగా పద్యప్రక్రియపై పట్టు సాధిస్తూ తొలి అవధానానికి శ్రీకారం చుట్టిన అవధాని పార్వతీశ్వర శర్మ రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాహిత్యసంస్థల ఆధ్వర్యవంలో తొలుత అష్టావధానాలు, తరువాత నవంబరు నెల, 2015లో విశాఖలో సంపూర్ణ శతావధానం చేసారు.
.

 

"అవధాన సుధాకర" "అవధాన భారతి" "అవధానభీమ" "శతావధాని" డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ పరిచయ పత్రం.


తల్లిదండ్రులు : సూర్యకాంత కామేశ్వరి, లక్ష్మీనరసింహ సోమయాజులు.
జన్మదినం : 09 - 12 - 1988.
జన్మస్థలం : శ్రీకాకుళం.

 

విద్యార్హతలు:
సంస్కృతంలోని క్షేమేంద్రరచిత "ఔచిత్యవిచారచర్చ" - తెలుగులో ప్రాచీన పంచకావ్యాలకు అన్వయం. (యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్ జూనియర్ రీసెర్చిఫెలోషిప్ - నెట్ పరీక్షలో విశ్వవిద్యాలయస్థాయిలో ప్రథమస్థానం. ఐచ్ఛికాంశం భారత భాగవతాల ప్రత్యేకాధ్యయనం.)

 

పర్యవేక్షకులు : "అద్వైత సిద్ధి రత్నాకర" ఆచార్య మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, ప్రొఫసర్‌, తెలుగుశాఖ, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం.

ఎం.ఏ. సంస్కృతం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌.
ఎం.ఏ. తెలుగు., ఆంధ్రవిశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం.
బియస్సీ మైక్రోబయాలజీ, డా|| వి.యస్‌. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖ.
ఇంటర్మీడియట్‌- మెడికల్‌లాబ్‌టెక్నీషియన్‌కోర్సు, ప్రభుత్వ జూ|| కళాశాల పెందుర్తి, విశాఖ.
తెలుగు భాషాపండిత అర్హత పరీక్ష 2012 లో ఆంధ్రవిశ్వకళా పరిషత్‌పరిధిలో ప్రథమ స్థానం మరియు రాష్ట్రస్థాయిలోద్వితీయ స్థానం.

 

నిర్వర్తించిన ఉద్యోగములు :
1. భాషాబోధకులు - వినెక్స్‌, ఐ.ఏ.ఎస్. అకాడమి, ద్వారకానగర్‌, విశాఖ.
సివిల్‌సర్వీసెస్‌, డి.ఎస్సీ. టెట్‌, డైట్‌సెట్‌మరియు డిగ్రీ విద్యార్థులకు.
2. రేడియో జాకీ, ఎఫ్‌.ఎం రెయిన్‌బో, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం.
3. అధ్యాపకులు - ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల (ప్రైవేటు), శివాజీపాలెం, విశాఖ.

 

అష్టావధానాలు:
అవధానానికి తాతగారు (పితామహులు) శ్రీరాంభట్ల పార్వతీశ్వరశర్మ గారు గురువు.
16వ ఏట అవధానాలు ప్రారంభం. : ఇప్పటివరుకూ రాష్ట్రవ్యాప్తంగా  ఒక శతావధానం, ఒక ద్విగుణిత అష్టావధానం,
45 అష్టావధానాలు.

 

రచనలు:
1. శ్రీ రాంభట్ల వేంకటీయము (ముద్రితం) - కీ.శే. డా|| రాంభట్ల వేంకటరావు (కుప్పిలి డాక్టరు) గారి సంగ్రహ జీవితచరిత్ర, (అవధాని ముత్తాత గారి జీవిత చరిత్ర) లఘుపద్యకావ్యం - 2007
2. మొదటి మొగ్గలు - వచన కవితావ్యాసంగం - 2012.
3. ప్రతిభాస్వరాలు - పద్యకవితాసంపుటి - 2012.
4. "శతావధాన భారతి" - శతావధాన పూరణలు - 2016.
5. ఇంకా ఎన్నెన్నో పద్య సన్మానపత్ర రచనలు.

 

జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణలు:
1. ప్రబంధనాయికగా ఊర్వశి - ఎ.వి.ఎన్‌. కళాశాల, విశాఖ.
2. శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో వ్యతిరేక స్త్రీపాత్రలు - అనుకూలభావాలు - సిద్ధార్థకళాశాల, విజయవాడ.
3. గుఱ్ఱం జాషువ కవిత్వం - ఔచిత్యపోషణ - తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వకళాపరిషత్‌.
4. ప్రసాదరాయ కులపతి అవధానసరస్వతి - ప్రభుత్వడిగ్రీకళాశాల, సిద్ధిపేట, మెదక్‌జిల్లా.
5. వేంకటరామకృష్ణ కవుల "ఔచిత్య విచారచర్చ" - అనువాద పద్ధతి
6. శ్రీ ఆముజాల నరసింహ మూర్తి "కన్నకూతురు" సాంఘికనాటకం - స్త్రీవాదాంశాలు.
7. నలుగురూ నడిచే త్రోవలో "ముళ్ళకంపలు"

 

పత్రికా వ్యాసాలు :
1. చిత్రకవితా చైత్రకవి - పాల్కురికి - ప్రసంగవ్యాసం
2. నవ్వూ... నువ్వెక్కడి దానివి? - స్మైల్‌ప్లీజ్‌మాసపత్రిక - మే, 2012.
3. వేణీ సంహారమ్‌- కల్పనలు - సంభాషణావైచిత్రి - సుపథ దినపత్రిక - మే,2012.
4. 'మార్గ’ దర్శకుడు శ్రీశ్రీ - విజన్‌దిన పత్రిక - మే,2012.
5. తెలుగు సాహిత్యంలో చర్చనీయాంశాలు - విజన్‌దిన పత్రిక - మే,2012.
6. నేటికాలపు సాహిత్యావధానాలు - సిలికానాంధ్ర, సుజనరంజని అంతర్జాల పత్రిక - మార్చి, 2013.
7. కథానిలయ కథలు ( కాళీపట్నం రామారావు జీవితావిష్కరణ) - విశాఖ సంస్కృతి మాసపత్రిక, 2012.
8. మూడురోజుల ముచ్చట : తెలుగుమహాసభల సమీక్షావ్యాసం - విద్య ఉద్యోగ దిక్సూచి, జనవరి, 2013.
9. 'సురభిళం’ ( సురభి నాటకసంస్థ నాగేశ్వరరావు గారితో పరిచయం)- విశాఖసంస్కృతి, మార్చి, 2013.
10. తెలుగు వార్తాపత్రికల్లోని భాష : తీరుతెన్నులు - ఇంటర్నేషల్‌ జర్నల్‌ ఆఫ్‌ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ - సెప్టెంబర్‌, 2014.
(ఇదే వ్యాసం సిలికానాంధ్ర వారి ’సుజనరంజని’ అంతర్జాలపత్రిక, ఏప్రిల్‌, 2015 సంచికలో ప్రచురితం.)
11. భిన్నత్వంలో ఏకత్వం : విశాఖతత్త్వం - విశాఖ ఉత్సవ్‌ప్రత్యేకసంచిక - 2015
12. తెలుగు దిన పత్రికలు - పదసృజన - ఆంధ్రవిశ్వకళాపరిషత్ - ఆర్ట్స్ కాలేజీ జర్నల్, డిశంబరు -2015

 

సాహిత్య రూపకాలు - ధరించిన పాత్రలు:
1. భువన విజయం : ధూర్జటి - జనవరి, 01- 2011, శ్రీలలితాపీఠం, విశాఖ.
2. ప్రాచీన ఆంధ్రకవులు : పాల్కురికి సోమన - ఫిబ్రవరి, 17 - 2011, శ్రీలలితాపీఠం,విశాఖ.
3. భువన విజయం : పింగళిసూరన - మే, 8- 2011, ఉక్కునగరం, స్టీల్‌ప్లాంట్‌, విశాఖప్నటం.
4. భువన విజయం : పింగళిసూరన - మే, 10- 2011, కళాభారతి, విశాఖప్నటం.
5. దేవీ విజయం (విజయ దశమి సందర్భంగా) : అల్లసాని పెద్దన - అక్టోబర్‌, 06 - 2011
6. శతక సరస్వతీ సాహిత్యసౌరభం : మారద వెంకయ్య - ఫిబ్రవరి, 06-2012, శ్రీలలితాపీఠం,విశాఖ.
7. ధర్మ విజయం : గౌతమబుద్ధుడు - 2014 శ్రీలలితాపీఠం, విశాఖ.
8. కందుకూరి ప్రభ : కందుకూరి వీరేశలింగం 27 ఏప్రిల్‌- 2015 పౌరగ్రంథాలయం, విశాఖ.
9. ఆనందగజపతి ఆస్థానం : చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి - 2015 శ్రీలలితాపీఠం, విశాఖ.

 

రేడియో ప్రసంగాలు:
1. అవధానం - వివిధ అంశాలు - ఆకాశవాణి, విశాఖపట్నంకేంద్ర ప్రసారం - 2006
2. అవధానం - అవగాహన (ఉగాది సం|| గా) - జ్ఞానవాణి ఎఫ్‌.ఎం - ముఖాముఖి - 2012
3. 'సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు’ - శతజయంత్యుత్సవం -జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. - 2013.
4. 'రాయప్రోలు రచనలు - జీవితం’ - రాయప్రోలు సుబ్బారావు వర్థంతి -జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. - 2013.
5. 'భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు’ - వారసత్వసంపద దినోత్సవం -జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. - 2013.
6. 'వసంతకేళి - హోళి’ - జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. - 2014.


 

ఆశు కవితా ప్రదర్శనలు
1. 'ఆశువుగా అవధానం’ - ప్రత్యక్షప్రసారం - దూరదర్శన్‌సప్తగిరి విజయవాడకేంద్రం - 23-01-2015
2. 'ఆశువుగా అవధానం’ - ప్రత్యక్షప్రసారం - దూరదర్శన్‌సప్తగిరి విజయవాడకేంద్రం - 06-03-2015
3. ఆశుకవితాప్రదర్శనం - ప్రత్యక్షప్రసారం - ఎఫ్.ఎమ్.రెయిన్‌బో 102- ఆకాశవాణి, విశాఖ - 21-02-2015 (అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం సందర్భంగా)
4. రాజకీయ అవధానం - టీవీ 5 న్యూస్‌ఛానల్‌లో ఆశుకవితా ప్రదర్శనం. - 21.03.2015 ఉగాది సం||గా
(ఈ వీడియోలు అన్నీ youtube లో అందుబాటులో ఉన్నాయి)

 

బహుమతులు : పురస్కారాలు:-
1. నోరి నరసింహ శాస్త్రి యువరచయిత ప్రోత్సాహక పురస్కారం, హైదరాబాద్ - 2016.
2. ఆంధ్ర సారస్వత సమితి - మచిలీపట్నం - 2016.
3. "అవధాన భీమ" - బిరుదము - నెహ్రూ సాహితీ సమితి - ద్రాక్షారామ - 2016
4. "అవధాన భారతి" బిరుదము - ప్రసన్నభారతి, విశాఖపట్నం. - 2015.
5. శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది విశిష్ట పురస్కారం - విశాఖజిల్లాయంత్రాంగం - 2015
6. 'అవధాన సుధాకర’ బిరుదము - విశాఖసాహితి, శ్రీ లలితాపీఠం సంయుక్తంగా - 2013.
7. పద్యరచనలో ప్రథమ బహుమతి - స్నేహ - అంతర్‌కళాశాలల పోటీలు - 2005.
8. 'అవధాని’ బిరుదము - డా||వి.యస్‌.కృష్ణా ప్రభుత్వడిగ్రీ కళాశాల,విశాఖ - 2006.
9. రాష్ట్రస్థాయి పద్యరచన పోటీలలో ప్రథమ బహుమతి- బ్రహ్మకుమారీస్‌హైదరాబాద్‌- 2006.

 

Avadhana Sudhakara” Dr. Rambhatla Parvatheeswara Sarma, acquired an unique place in the filed of “Avadhana” and earned a good name as the most intellectual in and abroad. He is the blessed younger son of his parents Sri Rammabhatla Lakshmi Narasimha Somayajulu and Smt. Surya Kantha Kameswari, born on 09.12.1988 in Srikakulam Town, Srikakulam District, and Andhra Pradesh. Right from his 8th standard itself, he evinced lot of interest towards learning of Telugu and Sanskrit literature. He took Poetic initiation from his grandfather by name ‘RAMBHATLA PARVATHEESWARA SARMA’. While studying, he started writing according to the prosody and gradually improved his power of Retention. At the age of 16 itself, he performed ‘Asthavadhanam’ most effortlessly and got appreciation from the great Scholars. In the year 2011, he did his M.A. Telugu literature with Distinstion from Andhra University, Visakhapatnam, and M.A. Sanskrit from Potti Sriramulu Telugu University Hyderabad. Later, he Qualified with meritorious performance in University grants commission’s National Eligibility Test, (UGC NET) and got admission in to Ph.D., Full Time at Andhra University in Telugu Discipline.

Persuued Ph.D. on Kshemendra Auchitya theory and its application to Ancient Telugu prabandhas as a Senior Research Fellow, in the department of Telugu, Andhra university under the guidance of “Adwaita Siddhi Ratnakara” Acharya Maddulapalli Dattatreya Sastry and got awarded in 2016.